Push Pull train Between Kothagudem and Vijayawada
ప్యాసింజర్ రైలు సంఖ్యలను మార్చడంతో పాటు ఏకంగా రైలునే మార్చడం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా మారింది. భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) స్టేషన్ నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రైల్వే అధికారుల నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల ప్రారంభంలో భద్రాచలంరోడ్ నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్యాసింజర్ స్థానంలో పుష్‌పుల్‌ను ప్రారంభించిన విషయం విదితమే.
కొత్తగూడెం రామవరం, న్యూస్‌టుడే
భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల ప్రజలకు ఆంధ్రా ప్రాంతంతో నేరుగా రాకపోకలు సాగించేందుకు ఉన్న ఏకైక రైలు విజయవాడ ప్యాసింజర్. నిత్యం ఈ రైల్లో దాదాపు వెయ్యిమంది జిల్లా వాసులు రాకపోకలు సాగిస్తారు. పెద్ద మొత్తంలో వ్యాపార సరకులు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. ప్యాసింజర్ రైలును నెల రోజుల క్రితం పుష్‌పుల్‌గా మార్చారు. సాధారణ రైలు స్థానంలో పుష్‌ఫుల్‌ను ప్రవేశపెట్టడంతో కొత్తగా ప్రయోజనాలు లేకపోగా పలు ఇబ్బందులకు తెరతీసినట్లైంది. గతంలో రాకపోకలు సాగించిన రైలులో ప్రతి బోగీకి మురుగుదొడ్ల సదుపాయం ఉండేది. ప్రస్తుతం నడిపిస్తున్న పుష్‌ఫుల్‌లో సరిపడినన్ని లేవు. మరో రైలులో అసలు మరుగుదొడ్లే లేకపోవడంతో మహిళలు, చిన్నారులతో సహా ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితి తలెత్తితే సమీప రైల్వేస్టేషన్ వచ్చే వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వేస్టేషన్‌లో ఆగిన వెంటనే ప్లాట్‌ఫాంలపై మరుగుదొడ్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాల్సి దుస్థితి నెలకొంది. దీనికితోడు రైల్వేస్టేషన్‌లలో మరుగుదొడ్లను ఉపయోగించుకునేందుకు రుసుములు చెల్లించాల్సి వస్తుందని, నిర్దేశించిన వాటికంటే ఎక్కువగా గుత్తేదార్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని స్టేషన్లలో తాళాలు వేసి ఉంటున్నాయి. అంతేకాక పలు స్టేషన్లకు ప్లాట్‌ఫాం సౌకర్యం లేకపోవడంతో రైలు దిగి, పైకి ఎక్కే ప్రయత్నంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇది మహిళలకు, చిన్నారులకు మరింత ఇబ్బందికరమవుతుంది. ఈ నేపథ్యంలో గతంలో వినియోగించిన పాసింజర్ రైలులే తిరిగి వినియోగించాలనే డిమాండ్ జిల్లా వాసులు వ్యక్తం చేస్తున్నారు.

అదనపు భారం.. భద్రాచలంరోడ్ స్టేషన్‌కు నెల్లూరు, గూడురు, భీమవరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి చేపలు, రొయ్యలు, ఎండు చేపల వంటి సముద్ర సంబంధ ఉత్పత్తులు వస్తుంటాయి. తిరుపతి, అనంతపురం, గుంతకల్లు, నటరాజ్, బెంగళూరు ప్రాంతాల నుంచి మోటర్ సైకిళ్లు, మార్బుళ్లు, గృహాలంకరణ, గృహనిర్మాణ సామగ్రి వస్తుంటాయి. గతంలో రాకపోకలు సాగించిన పాసింజర్‌లో లగేజ్‌లకు ప్రత్యేక బోగీ ఉండేది. ఇప్పుడు నూతనంగా వేసిన రైలులో ఆ సదుపాయం లేకపోవడంతో లగేజీని వేరే రైళ్లలో ఖాజిపేట జంక్షన్‌కు తరలించి అక్కడ నుంచి మరో రైలులో తిరిగి భద్రాచలంరోడ్ రైల్వే స్టేషన్‌కు తీసుకురావాల్సి వస్తుంది. దీంతో విజయవాడ నుంచి పెద్ద ఎత్తున సరుకులు భద్రాచలంరోడ్‌కు తీసుకువస్తున్న సరకులపై అదనపు భారం పడుతుంది. కాని ఈ భారం అంతిమంగా వినియోగదారులపైనే ఉంటోంది. అంతేకాక గతంతో పోల్చుకుంటే ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకున్న సరుకులు అక్కడినుంచి పాసింజర్ ద్వారా భద్రాచలం రోడ్ స్టేషన్‌కు చేరుకునేవి. ఇప్పుడు రైలు ఫుష్‌పుల్‌గా మారడంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సరుకులు తొలుత విజయవాడకు ఆపై ఖాజిపేటకు అక్కడి నుంచి భద్రాచలంరోడ్ స్టేషన్‌కు చేరుకుంటున్నాయి. దీనితో సమయం పెరగడం, ఆహార పదార్థాల నాణ్యత తగ్గడంతో పాటు అనవసర శ్రమ పెరుగుతుందని వ్యాపారులు వాపోతున్నారు. ఇది రైల్వేకు కూడా అదనపు శ్రమగా పరిణమిస్తుంది సరుకులను భద్రంగా చేర్చడం, లగేజిని ఎక్కించడం, దించడం కూడా ఇబ్బందికరంగా మారిందని పలువురు వాపోతున్నారు. కూలీల ఖర్చులు పెరగుతుండటంతో అదనపు భారం పడుతుంది. దీనితో వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడుతున్నారు. ఇది రైల్వే ఆదాయానికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. రైల్వే ఉన్నతాధికారులు సమస్యను సానుకూల దృష్టితో గమనించి గతంలోని రాకపోకలకు వినియోగించిన రైలులే తిరిగి పునరుద్ధరిస్తే ప్రయాణికులకు, వ్యాపారుల ఇబ్బందులు తొలగుతాయి.
No comments:
Post a Comment